విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 6న జరగనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు బి. గణేష్ పిలుపునిచ్చారు. భీమవరంలో మంగళవారం సాయంకాలం 5 గంటలకు సిఎస్ఎన్ కాలేజీలో పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులో ఆలస్యం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పీజీ స్కాలర్‌షిప్‌లు, జీఓ నం.77 రద్దు, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వీసీ, అధ్యాపక పోస్టుల భర్తీ, వసతిగృహాల అభివృద్ధి, మెస్ ఛార్జీల పెంపు వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.