-ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో కొంత నీరసపడ్డ మండప నిర్వాహకులు వినాయక చవితి పండుగ సందర్భంగా బుధవారం పట్టణం లోని వాడవాడలా కోలాహలంగా మారింది.అయితే మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం మూలంగా గత రెండు రోజుల నుంచి ఉత్సాహంగా మండపాలు తయారు చేసుకొని వినాయక విగ్రహాలను శోభాయమానంగా మేళ తాళాలతో నిమజ్జనాన్ని తలపించే విధంగా నెలకొల్పడానికి ప్రయత్నాలు చేయగా, బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురవడంతో మండప నిర్వాహకులు కొంతవరకు డీలా పడ్డారు.అయితే సాయంత్రం 6 గంటలకు మళ్ళీ వర్షం తగ్గుముఖం పట్టడంతో మండప నిర్వహకులు కేరళ బ్యాండ్, రాజస్థాన్ బ్యాండ్, మహారాష్ట్ర బ్యాండ్ తదితర ప్రధానమైన...