మైదుకూరులోని ప్రభుత్వ బాలుర వసతి గృహం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఇక్కడి విద్యార్థులకు శుద్ధి నీరు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల అవసరార్థం శుద్ధ నీటి యంత్రం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం యంత్రం మరమ్మతులకు గురైంది. నీటిని బయట నుంచి కొనుగోలు చేస్తున్నారు. విద్యార్థుల ఇబ్బందులను, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.