మంగళవారం రోజున పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ శాంతినగర్ వద్ద రైతులు గ్రోమోర్ ఎరువుల షాప్ ముందు తమకు యూరియా అందించాలని రాజీవ్ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు పెద్దపల్లి మండల రైతులు, రహదారిపై బైఠాయించడంతో అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామైన పరిస్థితి నెలకొంది, ఘటన స్థలానికి పెద్దపల్లి ఎస్సై చేరుకొని ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు వ్యవసాయ అధికారులతో మాట్లాడి రైతులకు యూరియా అందించేందుకు సహాయం చేస్తా అని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో నుండి విరమించారు