సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని లింగంపల్లి లో గల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం డార్మెంటరీ భవనం గోడ కూలిన ఘటనలో ముగ్గురి విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటన విషయం తెలుసుకున్న డీఈవో వెంకటేశ్వర్లు జహీరాబాద్ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.