అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలో పాత బస్టాండ్ అంబేద్కర్ కూడలి వద్ద ఈగల్ టీం ఆధ్వర్యంలో మాదిక ద్రవ్యాల వినియోగం గంజాయి నిర్మూలలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పట్టణంలో ప్రజలకు యువతకు గంజాయి నిర్మల గంజాయి వల్ల కలిగే నష్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి జోలికి యువత దూరంగా ఉండాలని గంజాయి నిర్మూలన ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. గంజాయి వినియోగించిన గంజాయి ఆనవాళ్లు పై సమాచారం అందించాలని సూచించారు.