మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమయి గూడెం వద్ద ఈనెల 2వ తారీఖున హత్యకు గురైన గొల్లపల్లి గ్రామానికి చెందిన బంటు వెంకటమ్మ అనే మహిళ హత్య కేసును మరిపెడ పోలీసులు చేదించారు సూర్యాపేట జిల్లా అనంతగిరి కి చెందిన వీరన్న అనే వ్యక్తి మృతురాలితో గత సంవత్సర కాలంగా పరిచయం ఉందని ఈ పరిచయంతో మూడు వేల రూపాయలు అడగగా, అంత డబ్బు తన దగ్గర లేదని 2000 మాత్రమే ఉన్నాయని చెప్పడంతో అత్యాశతో నిందితుడు వీరన్న మహిళను బీరు బాటిల్ తో కొట్టి చంపి మహిళ మెడ పై ఉన్న పుస్తెలతాడు నల్లపూసల గొలుసును తీసుకొని పరారయ్యాడు క్లూస్ టీం సాయంతో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని ఈరోజు అరెస్ట్ చేశారు.