పల్నాడు జిల్లా,వినుకొండలో విష్ణుకుండినగర్ లోని రద్దీగా ఉండే రామాలయం సమీపంలో శుక్రవారం దొంగతనం జరిగింది.ఇంటి యజమాని బయటికి వెళ్ళగా,దొంగలు తాళాలు పగలగొట్టి ఇంట్లో చొరబడి నగదు, బంగారం దోచుకున్నారు.విష్ణుకుండీ నగర్ లో నివాసం ఉంటున్న గద్దె వెంకట్రావు తన వ్యక్తిగత పనుల మీద బయటికి వెళ్ళారు, అదే సమయంలో ఆయన భార్య బంధువుల ఇంటికి వెళ్లారు.అదును చూసి దొంగలు ఇంటి ప్రధాన తలుపు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు.ఇంట్లోని బీరువాను తెరిచి అందులో ఉన్న నల్లపూసల గొలుసు, ఒక బంగారపు చైన్, రెండు ఉంగరాలు, మరియు పది వేల రూపాయల నగదును దొంగిలించారు.