చదువు మీద ఆసక్తి లేక జీవితంపై విరక్తి చెంది ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కుందారం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కుందారం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న దొంతమల్ల శరణ్య అనే విద్యార్థినీ చదువు మీద ఆసక్తి లేక తరచూ స్కూలుకు ఆబ్సెంట్ అవుతూ ఉండేది. దీంతో తల్లిదండ్రులు, పాఠశాల హెచ్ఎం స్కూలుకు వెళ్లాలని ఎన్నిసార్లు చెప్పిన వినకుండా చదువు మీద ఆసక్తి లేక జీవితంపై విరక్తి చెంది బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో స్నానానికని వెళ్లి బాత్రూంలో చున్నితో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.