రెబ్బెన ఏవో సమక్షంలో నిల్వ ఉంచిన 43 యూరియా బస్తాలను రెబ్బెన వ్యవసాయ సహకార సంఘం సీఈవో శేషారావు అమ్ముకున్నాడని ఉన్నతాధికారులకు ఏవో దిలీప్ కుమార్ రాతపూర్వకంగా గురువారం ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు ఒకటి రెండు బస్తాల కోసం రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న యూరియా దొరకడం లేదని ఆవేదన చెందుతుంటే అధికారులు తమ చేతివాటంతో కొంతమంది నాయకులకు అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండిన వరి పైరును సహకార సంఘం కార్యాలయానికి వేలాడదీసి రైతులు నిరసన తెలిపారు. సీఈఓ పై వెంటనే చర్యలు తీసుకొని యూరియా బస్తాలు ఇప్పించాల