సంతబొమ్మాళి మండలం కొల్లిపాడు, సిపురం గ్రామాల్లోని పౌరసరఫరాల దుకాణాలకు సరకులను అందించే వ్యాన్ శనివారం పల్టీ కొట్టింది.సంతబొమ్మాళిలో రెండు ఊర్లలోని వినియోగదారులకు ఇచ్చేందుకు బియ్యం, పంచదార ఇతర సరుకలు వస్తున్న వ్యాన్ కొల్లిపాడు గుండం చెరువు వద్ద బోల్తా పడింది. ఎదుట వచ్చిన వాహనాన్ని తప్పించబోయి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఎవరికీ ఇటువంటి ప్రమాదం జరగలేదు.