రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం అమలు కోసం గ్రామాలలో భూ సమ స్యలు ఎదుర్కొంటున్న రైతులకు మేలు చేసేందుకు గ్రామాల లోని రైతుల ద్వారా దరఖాస్తులను స్వీకరించేందుకు జిల్లా కలెక్ట ర్ బిఎం సంతోష్ ఆదేశాల మేరకు ఎర్రవల్లి మండలంలోని 11 రెవిన్యూ గ్రామాలలో వచ్చేనెల జూన్ 3 నుండి 17వ తేదీ వర కు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ నరేష్ తెలిపారు. 3న బట్లదిన్నె, 4న కొండేరు, 5న ధర్మవరం, 6న తిమ్మాపురం, 9న వల్లూరు, 10న రాజశ్రీ గార్లపాడు, 11న వేముల, 12న బి. వీరాపురం, 13న పుటాన్ దొడ్డి, 16న సాస నూలు, తదితర గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.