కడప: కడప జిల్లాలో గురువారం తెల్లవారుజామునుంచి జోరు వాన కురిసింది. కమలాపురం, చాపాడు, మైదుకూరు, ఖాజీపేట, కడప, చింతకొమ్మదిన్నెలో ఉదయం 4 గంటల సమయంలో మొదలైన వర్షం మోస్తరు స్థాయిలో కురుస్తూ చల్లని గాలులు వీచడంతో వాతావరణం చల్లబడింది.కొద్ది రోజులుగా ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు వర్షం కొంత ఊరటనిచ్చింది. వర్షం వల్ల తాత్కాలికంగానైనా ఎండ నుంచి ఉపశమనం లభించిందని స్థానికులు తెలిపారు.