కడప జిల్లా బద్వేల్ పట్టణంలో బుధవారం సాయంత్రం పలు ప్రధాన రహదారులలో అర్బన్ ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ మరియు ధ్రువ పత్రాలు లేని వారికి జరిమానాలు విధించారు. గతంలో వేసిన పైన్స్ చెల్లించని వాహనదారులు తప్పనిసరిగా చెల్లించాలని వాహన దారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.