తాళ్లూరు మరియు ముండ్లమూరు మండలాల్లో ఎమ్మార్వోలు మండల వ్యవసాయ అధికారులు కలిసి ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. తాళ్లూరు ఎమ్మార్వో రమణారావు ఏవో ప్రసాదరావు ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి ఎరువుల బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతును అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్ అమ్మకాల స్టాక్ వివరాలను సేకరించారు. కల్తీ ఎరువుల అమ్మకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దుకాణదారులు హెచ్చరించినట్లు తెలిపారు. ముండ్లమూరు ఎమ్మార్వో లక్ష్మీనారాయణ ఏవో తిరుమలరావు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు.