కూటమి ప్రభుత్వంలో యూరియా అందక రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పీలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం బాలి రెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళంపల్లి నుండి బస్ స్టాండ్ వరకు యూరియా కొరత పై నిరసన ర్యాలీ చేపట్టారు. బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, “రైతులు అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేసి వ్యవసాయం చేయాల్సి వస్తోందని అన్నారు. పంట చేతికి వచ్చిన తర్వాత సరైన గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.