నూజివీడు సబ్ కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పౌరసరఫరాలు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్టు రైసు కార్డులు పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిధిగా పాల్గొని, స్మార్టు రైసు కార్డులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ అధికారం ఇస్తే అభివృద్ధి వైపు నడపాలని, విధ్వంసం వైపు కాదని పేర్కొన్నారు.