నెల్లూరులోని బాలాజీ నగర్ లో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం ఆకట్టుకుంటుంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా భారీ విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. భక్తులు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వినాయక మండపం కూడా చక్కగా అలంకరించారు.. ఒరిస్సాలోని పూరి జగన్నాధుని ఆలయం తరహాలో ఇక్కడ వినాయకుని ఏర్పాటు చేశారు