నల్లగొండ జిల్లా: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి అన్నారు. ఆదివారం బడ్జెట్ను వ్యతిరేకిస్తూ నాంపల్లిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బడ్జెట్ పత్రాలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు .కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు.