నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గినట్లు ప్రాజెక్టు అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 589.10 అడుగులకు చేరిందన్నారు. దీంతో అధికారులు ప్రాజెక్టులోని రెండు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 71, 094 క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేశారు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు తెలిపారు.