మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలోని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా, ఐదో రోజు శ్రీ గంగా భ్రమరాంబ అమ్మవారు మహాలక్ష్మి దేవి అవతారంలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారికి కుంకుమార్చన చేసి, ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.