వాల్మీకిపురం మండలం కొత్త మంచూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.ప్రకాష్ ఇటీవల జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయునిగా అవార్డును మంత్రి మరియు కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నారు.ఇదిలా ఉండగా సోమవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని కలికిరి మండలం నగరిపల్లిలో ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు గ్రహీత వి.ప్రకాష్ మరియు ఉపాధ్యాయులతో కలిసి మర్యాదపూర్వంగా కలిసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు గ్రహీత ప్రకాష్ ను అభినందించి సన్మానించారు.