శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఎన్ ఎస్ యు ఐ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, అంబేద్కర్ కు నివాళులర్పించారు. అనంతరం నిరసన తెలియజేస్తూ వారు మాట్లాడుతూ ఎస్సై బాబ్జాన్ ఎస్సీ, ఎస్టీలపై విచక్షణ కోల్పోయి అవమానకరంగా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు. కుల దూషణ వ్యాఖ్యలపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.