విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 35 భాగాలుగా విడదీసి ప్రైవేట్ టెండర్లు పిలిచిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి. బలరాం డిమాండ్ చేశారు. శనివారం మధ్యాహ్నం 2:30 కు భీమవరం మెంటే వారి తోటలో జరిగిన సిపిఎం జిల్లాస్థాయి శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే ఐదువేల కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారని, ఫ్యాక్టరీకి గనులు కేటాయించకుండా నష్టాలు కలిగిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మర్చిపోయి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మౌనం పాటించడం, కేంద్ర మంత్రులు రక్షణ చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.