యూరియా కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఇటీవల ఆదేశించినా క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు యూరియా దొరకడం లేదు. డి.హిరేహాల్ మండలంలోని నాగలాపురం గ్రామ సచివాలయం వద్ద గురువారం ఉదయం నుంచే వందలాది మంది రైతులు యూరియా కోసం భారీ క్యూ కట్టారు. నాగలాపురం ఆర్ఎస్కె కు 12.6 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయిందని ఏడిఏ తెలిపారు. రైతులు ఎక్కువ, యూరియా తక్కువ ఉండటంతో తమకు దక్కుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.