దివ్యాంగుల కడుపులు కొడుతున్న టిడిపి ప్రభుత్వం : సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని బాష తెలుగుదేశం ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లు తొలగించి వారి కడుపులు కొడుతున్నాడని సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పత్రిక ప్రకటన విడుదల చేసిన జిలాని భాష గారు మాట్లాడుతూ గతంలో సదరం క్యాంపులు నిర్వహించి ముగ్గురు డాక్టర్ల పర్యవేక్షణలో పరీక్షించి సర్టిఫికెట్లు మంజూరు చేస్తే, నేటి తెలుగుదేశం ప్రభుత్వం రీ వెరిఫికేషన్ పేరుతో 35 నుండి 40 సంవత్సరాల నుండి తీసుకుంటున్న దివ్యాంగుల పెన్షన్లను తొలగించడం ఎంతవరకు సమంజసమని రీ వెరిఫికేషన్ అంటూ ఇతర జిల్లాల నుంచి అవగాహన, అనుభవం లేని డాక్టర్లతో పరిశీలన చేయించి వారు భౌతికంగా పరీక్షించకుండానే దివ్యాంగ అభ్యర్థులను దూరం నుండి చూసి పంపించి వారికి ఇష్టం