రాష్ట్రంలో సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ 670 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేశారు. తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బిజెపి ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాలలో అభివృద్ధి పనులు చేసి బిల్లులు రాక మాజీ సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే పాల్వాయి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిపడ్డ 670 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు,