గుత్తి పీఎస్ఐ గౌతమ్, కానిస్టేబుళ్లు భాస్కర్ నాయుడు, మహాలక్ష్మి ఎంతో చక చక్యంగా వ్యవహరించి అదృశ్యమైన యువతి ఆచూకిని కనుగొన్నారు. వివరాల్లోకి వెళితే గుత్తి ఆర్ఎస్ కు చెందిన ఓ యువతి గత మూడు రోజుల క్రితం అదృశ్యమైంది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పీఎస్ఐ గౌతమ్ నిఘా ఏర్పాటు చేసి విజయవాడ లోని ఓ దర్గాలో ఉన్న యువతిని గుర్తించారు.బుధవారం సదరు యువతికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.