అల్లూరి జిల్లా జిమాడుగుల మండలం గద్దరాయికి వెళ్లే ప్రధాన రహదారిపై కొండ వాగు ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో స్థానిక గిరిజనులు తీవ్ర అవస్థలు పడ్డారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో వాగు ఉధృతి అధికంగా ఉండడంతో సమీప గ్రామాల నుండి మండల కేంద్రానికి చేరుకునేందుకు స్థానిక గిరిజనులు అంతా ఓ తాడు సహాయంతో వాగు దాటి మండల కేంద్రాలకు చేరుకున్నారు. ఇదే వాగుపై బ్రిడ్జి నిర్మించాలని గతంలో అధికారులకు అనేకమార్లు విన్నవించినప్పటికీ సమస్య పరిష్కరించలేదని, సంబంధిత శాఖల అధికారులు ఇకనైనా తమ సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.