ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం పెరేడ్ గ్రౌండ్లో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలకు క్యూఆర్ కోడ్ కలిగిన డిజిటల్ స్టిక్కర్లు, పత్రాలను డ్రైవర్లు, ఓనర్లకు ఎస్పీ స్వయంగా అందజేశారు. ట్రాఫిక్ నియమాలు, భద్రతపై పలు సూచనలు చేశారు.