Parvathipuram, Parvathipuram Manyam | Aug 23, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలోని పెద్దగెడ్డ జలాశయం నిర్మాణం కోసం భూములు ఇచ్చిన నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని నిర్వాసితుల సంఘం రాష్ట్ర నాయకుడు ఎం కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. పాచిపెంట మండలంలోని కేసలి, కోటికిపెంట గ్రామాలలోని నిర్వాసితుల కుటుంబాలతో ఆయన మాట్లాడారు. ఇతర ప్రాంత రైతులకు సాగునీరు అందించడం కోసం తమ భూములను, ఇళ్లను వదులుకున్న నిర్వాసిత గ్రామాల వారికి ప్రభుత్వం న్యాయం చేయాల్సి ఉందన్నారు. సరైన ఇల్లులు కూడా లేకుండా అవస్థలు పడుతున్నారని, ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు జరపాలని డిమాండ్ చేశారు.