పల్నాడు జిల్లా, పెడకూరపాడు నియోజకవర్గం క్రోసూరు పట్టణంలో వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో శుక్రవారం సాయంత్రం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. కల్లాలలో ఉన్న మిర్చి వర్షానికి తడిసిపోయి రైతుల నష్టపోయారు. చెట్లకు నాలుగవ కోతకు సిద్ధంగా ఉన్న మిర్చికి కూడా నష్టం వాటిల్లి అవకాశం ఉందని రైతులు తమ అవేదన వ్యక్తం చేశారు. అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, బెల్లంకొండ, పెదకూరపాడు మండలాల్లో వర్షం కురిసింది. రైతులు మిర్చిపై పరదాలు కప్పినప్పటికీ ఈదురు గాలికి కొట్టుకుపోయాయి.