ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని పెద్దవాగులో ఆదివారం మధ్యాహ్నం స్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంతు అయ్యారు. గమనించిన ట్రాక్టర్ డ్రైవర్ వెంటనే ఇద్దరిని వెలికి తీయగా.. షేక్ మహబూబ్ అనే యువకుడు గల్లంతు అయ్యాడు. అతడి కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.