తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపోలూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ నారాయణ పేరాంటాళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో శనివారం నాలుగోవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరిపించారు. ఈ వేడుకల్లో భాగంగా ముందుగా కలిశా స్థాపన చేసి గణపతి పూజ చేశారు. అనంతరం మహా గణపతికి, బాలసుబ్రమణ్యం స్వామికి అలాగే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం హోమాలు వేసి వేదపండితులు పూజలు జరిపించి పూర్బహుతి పూజ చేశారు. అమ్మవారికి ప్రత్యేకంగా ముత్యాల అలంకారం చేశారు. ఈ సందర్భముగా పెద్ద సంఖ్యలో భక్తులు పేరంటాలమ్మ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు సేవించారు. ఈ పూజల్లో కొండమరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో