ఉల్లిపంటకు కనీసం క్వింటాలుకు రూ.2,000 ధర ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సోమవారం కర్నూలు ఉల్లి మార్కెట్‌ను పరిశీలించిన జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ, అధ్యక్షుడు కే.వెంకటేశులు మాట్లాడుతూ… ప్రస్తుతం మార్కెట్‌లో రైతులకు క్వింటాలుకు కేవలం రూ.500 మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఎకరాకు సుమారు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని, ఇంత తక్కువ ధర ఇస్తే రైతులు నష్టాల్లో మునిగిపోతారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉల్లిపంటకు రూ.2,000 కంటే తక్కువ వచ్చినప్పుడు బోనస్ ప్రకటించినా… ఇప్పటికీ రైతులకు ఆ బోనస్ డబ్బులు అ