అరాచక వైఎస్సార్సీపీ పాలనను అథఃపాతాళానికి తొక్కేసిన ధీరుడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్‌ను సాధించిన యోధుడు మా అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అని విశాఖ 22వ వార్డు కార్పొరేటర్, జనసేన నేత పీతల మూర్తి యాదవ్ అన్నారు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని మంగళవారం ఆయన రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలకు అపద్బాంధవుడుగా, నమ్మిన జనసైనికులకు, వీర మహిళలకు, పిఠాపురం వాసులకు ప్రజల దేవుడుగా, ప్రపంచంలో ఉన్న తెలుగువారిని సమస్యల నుంచి విడిపించే విశ్వ విజేతగా నిలిచారన్నారు.