కాటేపల్లి తాండలో పంటల ధ్వంసం, సందర్శించిన ఎస్సై సెల్ ఛైర్మెన్... అటవీ మంత్రిని కలిసి గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం తాను కృషి చేస్తానని జుక్కల్ ఎస్సై సెల్ ఛైర్మెన్ సౌదగార్ అరవింద్ అన్నారు. ఆదివారం ఆయన పెద్ద కొడప్ గల్ మండలం కాటే పల్లి తండాలో పర్యటించారు. రాత్రి 7:30 గంటలకు మాట్లాడుతూ ఇటీవల గిరిజనులు సాగు చేస్తున్న భూమిలో పంటలను అటవీ అధికారులు ధ్వంసం చేసిన విషయం తెలుసుకొని వచ్చానని, ఇది చాల బాధాకరమైన విషయం అని అన్నారు.రైతులకు భరోసాను ఇచ్చి అటవీ శాఖ మంత్రిని కలిసి భూ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.