వికలాంగుల పెన్షన్లు తొలగిస్తున్నామని వైసిపి దుష్ప్రచారం చేస్తుందని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. శనివారం కొండపి పట్టణంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ మారీ టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి హాజరయ్యారు. కొండపి నియోజకవర్గం లోని అన్ని మండలాలకు చెందిన టిడిపి కమిటీలను ఏర్పాటు చేశారు.