సోన్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రాంతీయ సంయుక్త సంచాలకులు సత్యనారాయణ రెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా తొలిమెట్టు కార్యక్రమాలను పరిశీలించారు. అభ్యసన ఫలితాల సంబంధిత ప్రశ్నలు విద్యార్థులను అడిగి వారి ప్రగతిని తెలుసుకున్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. పాఠశాలలో జరుగుతున్న విద్యా సంబంధిత కార్యక్రమాలు మధ్యాహ్న భోజనం నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల వివరాలు యు డైస్ ఆన్లైన్ లో నమోదు చేయాలని సూచించారు. ఇందులో జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, పరీక్షల బోర్డు సహాయ కార్యదర్శి భానుమూర్తి తదితరులున్నారు.