సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో భారీ వర్షాలతో పలు ఇల్లు దెబ్బతిన్నాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో మండలంలోని అల్గోల్, దిడిగి తో పాటు పలు గ్రామాల్లో ఇండ్లు పాక్షికంగా గోడలు పైకప్పులు కూలి పోయాయి. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు కూలిపోయిన ఇళ్లను పరిశీలించారు. నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు.