Parvathipuram, Parvathipuram Manyam | Aug 24, 2025
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) డిమాండ్ చేసింది. అదివారం పార్వతీపురం సుందరయ్య భవనంలో నిర్వహించిన భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో సంఘం జిల్లా *అధ్యక్ష, కార్యదర్శులు కె గౌరీశ్వరరావు, ఆర్ రామ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి వసూలు చేస్తున్న సెస్ నిధులను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి వెచ్చించడం లేదని అన్నారు. ఇప్పటివరకు ఒక లక్ష 17 వేల కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి వసూలు చేశాయన్నారు.