భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో కార్మికులు గురువారం రాత్రి రాజమండ్రిలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. సమైక్య అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ, ఏపీలో కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భవనాల నుంచి వసూలు చేసే సొమ్మును చెస్సుగా కార్మికులకే వర్తింప చేయాలన్నారు. న్యాయం జరగకుంటే సర్కారుకు వ్యతిరేకంగా రోడ్డు ఎక్కుతామని హెచ్చరించారు.