కొత్త బిచ్చగాళ్లకు పొద్దెరగదు అన్న చందంగా BRS నాయకులు ప్రవర్తిస్తున్నారని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కల్యాణి అన్నారు. శనివారం సాయంత్రం తాడ్వాయి మండలం కన్నెపల్లి గ్రామస్థులతో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. కావాలని కొందరు BRS నాయకులు రైతులను వాడుకుంటున్నారని, గత పది సంవత్సరాల BRS ప్రభుత్వంలో ఏనాడు రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు.