నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో ఆదివారం డ్యాం 26 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని ఆదివారం విడుదల చేశారు. కృష్ణమ్మ అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సెలవు రోజు కావడంతో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. శివాలయ ఘాటు నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పర్యాటకుల తాకిడి పెరగడంతో పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమించారు.