ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల వ్యతిరేకని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఎరువుల బ్లాక్ మార్కెట్ పై వైసీపీ అన్నదాత పోరు పోస్టర్ను ఆదివారం విజయవాడలో తన కార్యాలయంలో మేయర్ రాయడం భాగ్యలక్ష్మి తో కలిసి ఆవిష్కరించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ.. ఎప్పుడు పెట్టుబడిదారులకే వత్తాసు పలుకుతారు అని వ్యవసాయ మంత్రి అచ్చం నాయుడు వ్యాఖ్యలు దారుణం అన్నారు. ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం రైతులు క్యూ లైన్ లో నిలబడుతున్నారని ఈ విషయం పట్ల కుటమి ప్రభుత్వం విషయం కక్కుతుందన్నారు.