అదిలాబాద్ లోని కే.ఆర్.కే కాలనీలో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. డీఎస్పీ జీవన్ రెడ్డి నేతృత్వంలో సీఐ లు, ఎస్ఐ లు, పోలీస్ సిబ్బంది తో కలిసి ఆదివారం తెల్లవారుజామున కాలనీలో ఇంటింటి సోదాలు చేపట్టారు. ఈ తనిఖీలు ఎలాంటి పత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 17 ఆటోలను, 3 గంజాయి మొక్కలు, 10 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కాలనీలో ఎవరైనా అనుమానితులు తిరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు