బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, మండల తహశీల్దారులకు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేసామని ఆయన తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా క్షేత్రస్థాయిలో అధికారులంతా అందుబాటులో ఉండి రైతులను అప్రమత్తం చేసి వారికి తగు సూచనలు సలహాలు అందజేయాలని