జిల్లాలో వాహనమిత్ర పథకం కింద వచ్చేనెల 4న ఆటో డ్రైవర్లకు రూ.15,000 చొప్పున అందజేస్తామని మంత్రి సవిత తెలిపారు. సోమవారం ఆమె పెనుకొండలో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 5,202 మంది, పెనుకొండ నియోజకవర్గంలో 800 మంది వాహన మిత్రకు ఎంపికయ్యా రన్నారు. అక్టోబర్ 4న అర్హుల ఖాతాల్లో రూ.15వేల చొప్పున ప్రభుత్వం జమ చేస్తుందని వివరించారు.