చెన్నూరు మండలం లంబడి పల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలసి మంత్రి వివేక్ వెంకటస్వామి శుక్రవారం ఉదయం పర్యటించారు. పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి రిబ్బన్ కట్ చేసి అనంతరం నూతన గ్రామపంచాయతీ భవనంకు భూమి పూజ చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన ప్రజల కోసం పనిచేస్తుందని ఎవరికి ఏ సమస్య ఉన్న అధికారుల దృష్టికి తీసుకొచ్చి పనిచేయించుకోవాలని కోరారు. రేషన్ కార్డుల జారీ విషయంలో అలసత్వం అధికారులు వహిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకురావడంతో అధికారులపై మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు.