ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సూచనల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో భీమవరం ఏరియా ఆసుపత్రి వద్ద HIV/AIDS పై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం బుధవారం సాయంకాలం 5 గంటలకు నిర్వహించారు. ఈ సందర్భంగా 5K Red Run ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. గీతాభాయి జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా డా. గీతాభాయి మాట్లాడుతూ విద్యార్థులు HIV/AIDS తో పాటు దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన పెంపొందించుకోవాలని, ఆరోగ్యకరమైన శరీర నిర్మాణం కోసం ప్రతిరోజూ ఆరోగ్య నియమాలను పాటించి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.